ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పారామెడికల్ కళాశాలను వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం , డిసెంబర్ 2 ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నుండి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు ప్రారంభించారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పారామెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ పారామెడికల్ కళాశాలలో 30 డి ఎం సి టి మరియు 30 డయాలసిస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమార్ , వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్లు, వైద్య, నర్సింగ్ విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!