ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

కరకగూడెం,నవంబర్ 26 ఆధాబ్ న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ నవంబర్ 29,2009 చేపట్టిన దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరకగూడెం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ ఇచ్చుడో ఆమరణ దీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించి,చరిత్రలో నిలిచారని అన్నారు.ఆ చరిత్రత్మకమైన రోజును గుర్తు చేసుకున్నందుకు ఈనెల నవంబర్ 29 జిల్లా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నందు దీక్షా దివాస్ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాయం నరసింహారావు,మండల నాయకులు పోగు వెంకటేశ్వర్లు,భైరశెట్టి చిరంజీవి,గుడ్ల రంజిత్, ఇర్ఫా సత్యం,రావుల కనకయ్య,వట్టం సమ్మయ్య,అరేం కృష్ణమూర్తి,ఎలగొండ వెంకటేశ్వర్లు,నిట్టా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!