ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు.
డిఎస్పీ .చంద్రభాను. భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నవంబర్ 24 ఆధాబ్ న్యూస్ :
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని అయిత ఫంక్షన్ హాలు నందు సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈసిజీ,గైనకాలజీ,బీపి,షుగర్,దంత సమస్యలు,కళ్ళ పరీక్షలు,ఆర్థోపెడిక్,యురాలాజీ,ఫిజియోతెరపి,గుండె సంభంధిత పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసే విధంగా నిపుణులైన వైద్యులు చేత ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలియజేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో భర్తీ అయినప్పుడు కఠినమైన శిక్షణతో,పూర్తి శారీరక సామర్థ్యంతో,ఆరోగ్యంగా శిక్షణా కేంద్రాల నుండి ప్రజలకు సేవలు అందించడానికి బయటకు రావడం జరుగుతుందన్నారు.ఆ తర్వాత విధులలో చేరినప్పటి నుండి నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో పాటు,ప్రజలకు సేవలందిస్తూ పోలీసులు విశ్రాంతి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది అన్నారు.చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించాల్సి వస్తుందని,అందుమూలంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.పోలీసులు అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తూ,తాము అడగగానే పోలీస్ కుటుంబాలకు కూడా వైద్య చికిత్సలు చేయడానికి విచ్చేసిన వైద్య బృందానికి కూడా ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.వైద్య వృత్తి కూడా చాలా బాధ్యతాయుతమైన వృత్తి అని కొనియాడారు.అనంతరం ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులందరినీ శాలువాలు,మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐ సత్యనారాయణ,సీఐ టేకులపల్లి సురేష్,గుండాల సీఐ రవీందర్, ఎస్సైలు రతీష్, రాజమౌళి,శ్రీకాంత్,నాగుల్ మీరా,సూర్య మరియు పట్టణంలోని ప్రముఖ వైద్యులయిన హర్షవర్ధన్, రవి తేజస్వి, సాయి చరిష్మ, రామ్ నివాస్, అశోక్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు.









