యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కరకగూడెం ఎస్సై. రాజేందర్. కరకగూడెం నవంబర్ 20 ఆధాబ్ న్యూస్ : కరకగూడెం, మండల పరిధిలోని బట్టుపల్లి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కరకగూడెం ఎస్సై. రాజేందర్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన జరిగే నష్టాలు గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిలో మార్పు తీసుకురావడం కొరకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పడడం జరిగిందని అదేవిధంగా పాఠశాలలో చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండలంలోని అన్ని స్కూళ్లు యాంటీ ర్యాగింగ్స్ స్క్వడ్లను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది అనిఈ సందర్భంగా తెలియజేశారు.ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేసినా,విక్రయించినా,వినియోగించడం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై రాజేందర్, రైటర్ దుర్గారావు, శివ పోలీస్ సిబ్బంది. ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.









