కొత్తగూడెం నవంబర్ 19 ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగులకు ఈ నెల 20న ప్రగతి మైదాన్ కొత్తగూడెం నందు దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంక్షేమ శాఖ, మహిళాభివృద్ది , శిశు , వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ల జిల్లా అధికారి స్వర్ణ లత లేనిన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే ఆటల పోటీలలో పాల్గొనే దివ్యాంగులు జూనియర్ విభాగం వయస్సు 10-17 సంవత్సరాలు మరియు సీనియర్ విభాగంలో 18-54 సంవత్సరాల వారికి రన్నింగ్, షాట్పుట్, చెస్, పోటీలు బాల బాలికలకు విడివిడిగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆటల పోటీలో పాల్గొనే స్పెషల్ స్కూల్ పిల్లలు, దివ్యాంగులు పాల్గొని జిల్లా స్థాయి ఆటల పోటీలను దిగ్విజయం చేయవలసినదిగా కోరారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో గెలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడునని జిల్లా సంక్షేమ శాఖ అధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇతర వివరముల కొరకు 6301981960 సంప్రదించాలని కోరారు.









