కొత్తగూడెం,నవంబర్ 16 ఆధాబ్ న్యూస్ :
లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల, మైలారం ఏజెన్సీ గ్రామాల నుంచి పలువురు కుటుంబాలు శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలో సిపిఐలో చేరారు, వీరికి ఎర్ర కండువాకప్పిన అనంతరం పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని అందించి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గట్టుమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని మారుమూల ఏజెన్సీ పల్లెలు సిపిఐ పక్షమేనని, అనాదిగా ఏజెన్సీ గిరిజన ప్రజలకు, గిరిజనేతర పేదలకు సిపిఐ అండగా నిలిచి వారి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైందని అన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆదుకున్నామని, ప్రజల్లో మమేకమై సేవలందించిన ఫలితంగానే ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నారని, ఎన్నికల సమయంలో వచ్చి వెళ్లే రాజకీయపార్టీల నాయకులను ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ పునరుద్ధరణ, చేర్పింపు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని, నియోజకవర్గ పరిధిలో సకాలంలో పూర్తి చేసి జిల్లా కేంద్రానికి అందించాలని, సిపిఐ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రతి గ్రామంలో, బస్తీల్లో వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, దీటి లక్ష్మీపతి, దారా శ్రీనివాస్, కుంజా రాంబాబు, జోగా రాంబాబు,కారం జనార్దన్, దేవరగట్ల రాంబాబు, దేరంగుల సత్యం, చక్రపాణి, శ్రీరాంరెడ్డి, కంటెం రాజశేఖర్, కోడి లింగయ్య, వంక శ్రీను తదితరులు పాల్గొన్నారు.









