ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సారపాక ఐటీసి గెస్ట్ హౌస్ లో అధికారులతో సమన్వయ సమావేశం. రాష్ట్ర డీజిపి డా.జితేందర్ ఐపిఎస్.

భద్రాచలం, నవంబర్ 11 ఆధాబ్ న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర డిజిపి డా.జితేందర్ ఐపిఎస్ హైదరాబాదు నుండి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.డీజీపీతో పాటు ఇంటిలిజెన్స్ శివధర్ రెడ్డి ఐపీఎస్,మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ లు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఇతర సిఆర్పిఎఫ్ అధికారులు మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్, ములుగు జిల్లా ఎస్పీ డా.శభరీష్ ఐపిఎస్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్, గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి మరియు ట్రైనీ ఐపిఎస్ లు ఉన్నారు. సమన్వయ సమావేశానికి విచ్చేసిన డీజీపీ కి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ స్వాగతం పలికారు.అనంతరం అధికారులతో సమన్వయ సమావేశానికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులందరూ ప్రస్తుత సరిహద్దుల్లోని మావోయిస్టుల కదలికలపై ప్రస్తుత స్థితిగతులను డీజీపీకి వివరించారు.ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని,అభివృద్ధి నిరోధక సంఘటనలు జరగకుండా తెలంగాణ- చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో పనిచేసే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా మరియు ఇతర సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.కానీ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి ఏజన్సీ వర్గాలకు చెందిన భయబ్రాంతులకు గురిచేస్తూ,అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ దుశ్చర్యలకు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు నిర్వహించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!