మండల అధ్యక్షులు ఇగ్బాల్ హుస్సేన్ .
కరకగూడెం, నవంబర్ 8 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం రైతుల కోసం రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ ఉద్యోగాలు వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యంలో ప్రతి ఒక్క హామీలు నెరవేరుతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









