భద్రాచలం,నవంబర్ 6( ఆధాబ్ న్యూస్): మారుమూల గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని మరింతంగా అభివృద్ధి చేసేందుకు రైతుల పంట భూముల్లో అటవీ విద్యుత్ శాఖల సమన్వయం సహకారంతో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటన్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. అటవీ విద్యుత్ శాఖ అధికారులతో ఆదివాసి గిరిజన గ్రామాల్లో పోడు పట్ట కలిగిన రైతుల వ్యవసాయ భూముల్లో విద్యుత్ మోటర్లు సౌకర్యం కల్పించడానికి చేపట్టవలసిన కార్యచరణ పై భద్రాచలం ఐటిడిఏ సమావేశం మందిరంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ గిరిజన రైతుల వ్యవసాయ భూములకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించడానికి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నిష్టాతులైన ఫారెస్ట్ ,విద్యుత్ సిబ్బందిని పంపించి పకడ్బందిగా సర్వే చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో డేవిడ్ రాజ్ ,డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఏపీవో పవర్ ఏఈ మునీర్ పాషా , డి ఎఫ్ ఓ లు , విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.









