సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పాయం నిధులు మంజూరు చేయాలని వినతి . హైదరాబాద్, అక్టోబర్ 31 (ఆధాబ్, న్యూస్ ): హైదరాబాద్ లోనీ గాంధీభవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి ప్రసాదాన్ని అందించి. అనంతరం పినపాక నియోజకవర్గం సమస్యలపై సీఎంతో చర్చించారు పులుసు బొంత ప్రాజెక్టు, మారేళ్లపాడు లిఫ్టు, రేగుల గండి గ్రావేటీకరణ , పేరంటాల చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం ను కోరారు. విద్య ,వైద్యం సంబంధించి పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
Post Views: 35









