మత్స్య అభివృద్ధి పథకం కింద చేపల సొసైటీ లకు చేప పిల్లలు పంపిణీ .
ఎమ్మెల్యే పాయం.
మణుగూరు,అక్టోబర్ 29( ఆధాబ్ న్యూస్): మణుగూరు మండల కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 28 చేపల సొసైటీ సభ్యులకు చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారులను దృష్టిలో పెట్టుకుని అనేక మంచి కార్యక్రమాలను చేస్తుందని ప్రభుత్వం 100% రాయితీని కల్పిస్తూ 35 నుంచి 40 మీ.. మీ సైజు పరిమితం గల చేప పిల్లలను మండలంలో 1,62,750 చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చాప పిల్లలను సొసైటీ వారు చెరువులో వేసుకుని వాటిని మంచిగ పెంచి వ్యాపారం చేసి మంచి లాభాలు తెచ్చుకోవాలని సొసైటీ వారి కుటుంబ సభ్యులు ఆనందంగా ఈ వ్యాపారం ద్వారా లాభాలు పొందాలని తెలియజేశారు . ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మత్స్య శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయం వెంకటేశ్వర్లు
కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.









