ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు.

కరకగూడెం, అక్టోబర్ 28 (ఆధాబ్ న్యూస్) : కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్ పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!