ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు మరో షాక్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు మరో షాక్

న్యూఢిల్లీ, మే 19 (ఆధాబ్ న్యూస్):

దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి ఇంధన ధరల భారం పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒకే వారంలో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. గత మే 15న లీటరుకు రూ.3 చొప్పున పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, తాజాగా మంగళవారం మరో 90 పైసల మేర ధరలను పెంచాయి.

దీంతో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే లీటర్ ఇంధనంపై దాదాపు రూ.3.90 వరకు అదనపు భారం పడింది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.110.85కు చేరగా, డీజిల్ ధర రూ.98.96గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.98.64, డీజిల్ రూ.91.58గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.107.59, డీజిల్ రూ.94.08గా ఉండగా, కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.70, డీజిల్ రూ.96.07గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ రూ.96.11గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువలో మార్పులు వంటి కారణాలతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశముండటంతో, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు (VAT) ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….