ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  నన్ను సస్పెండ్ చేసే అధికారం మండల పార్టీకి లేదు : కోలేటి భవాని శంకర్.

నన్ను సస్పెండ్ చేసే అధికారం మండల పార్టీకి లేదు : కోలేటి భవాని శంకర్.
            మండల పార్టీ నిర్ణయాన్ని ఖండించిన కోలేటి

పినపాక, ఆధాబ్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్లు మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ప్రకటించడం పై కోలేటి భవాని శంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్రస్థాయి కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాత్రమే కొనసాగుతున్నారని, మండల, జిల్లా కమిటీలు మరియు అనుబంధ సంఘాల కమిటీలు రద్దు అయ్యాయని పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిందన్నారు.

పినపాక మండల అడహక్ కమిటీ పేరుతో తనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం చెల్లదని పేర్కొన్నారు. ఒకవేళ కమిటీ ఏర్పాటు చేసినా అది పార్టీ అధిష్టానం ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుందని తెలిపారు. తనను పార్టీ నుంచి కొనసాగించాలా, తొలగించాలా అన్న తుది నిర్ణయం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుదేనని స్పష్టం చేశారు.

తుమ్మల నాగేశ్వరరావుకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయలేదని, వ్యక్తిగత అభిమానంతో అన్ని పార్టీలకు చెందిన అభిమాన సంఘ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. అదే తప్పయితే పగడాల సతీష్ రెడ్డి తన కారుపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని తిరగడం, ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కూడా తప్పేనని ప్రశ్నించారు.

“నువ్వు చేస్తే సంసారం.. నేను చేస్తే వ్యభిచారమా” అంటూ మండల అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత అభిమానం వేరు, పార్టీ వేరు అని పేర్కొంటూ సతీష్ రెడ్డి ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సమయంలో కూడా తాను బిఆర్ఎస్ పార్టీలోనే ఉండి రేగా కాంతారావు వెన్నంటి పనిచేశానని గుర్తు చేశారు. ఇటీవల బూర్గంపాడు మండలానికి చెందిన కొంతమంది టిఆర్ఎస్ నాయకులు, వనమా వెంకటేశ్వరరావు కూడా తుమ్మలను సన్మానించారని, వారినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని, స్వార్థ రాజకీయాలకు తావు ఇవ్వనని స్పష్టం చేశారు. ఈ అంశంపై రేగా కాంతారావు స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….