ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  బట్టుపల్లిలో బిఆర్ఎస్ నూతన కార్యాలయం ప్రారంభం రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : రేగా కాంతారావు

బట్టుపల్లిలో బిఆర్ఎస్ నూతన కార్యాలయం ప్రారంభం
రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : రేగా కాంతారావు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ప్రారంభించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్ధం సాంబయ్య అధ్యక్షతన, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరోనా పరిస్థితుల్లో కూడా రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేశామని, రైతుబంధు, రైతుభీమా, పింఛన్లు సకాలంలో అందించామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు సకాలంలో ఇవ్వకపోవడంతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా పంపిణీలో యాప్ విధానం తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బైరిశెట్టి చిరంజీవి, కొమరం రాంబాబు, సర్పంచ్ బట్టల సందీప్, ఉపసర్పంచ్ బుడగం రాము, ఉప్పల శ్రీధర్, మొత్తం సతీష్, ఉప్పల ఆదినారాయణ, కుంటిగొర్ల వెంకన్న, పిర్ర విష్ణు, ఎక్కడి భాస్కర్, కొంచెం వీరన్న, ఈసం శంకర్, నాగమణి, వార్డు సభ్యులు సూర మధు, పిట్టల లక్ష్మణ్, గోని లింగయ్య, పోగు నారాయణ, ఓర్సు సత్యనారాయణతో పాటు సోషల్ మీడియా వారియర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….