లక్ష్మీపురంలో దారుణ హత్య.. బండరాయితో వ్యక్తి హత్య
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు బండరాయితో దాడికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం, బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌పై బండరాయితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై మేడ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Views: 25









