ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  లాడ్జిల్లో నిబంధనలు తప్పనిసరి.. ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు : ఎస్పీ రోహిత్ రాజు

లాడ్జిల్లో నిబంధనలు తప్పనిసరి.. ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు : ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం, మే 09 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు లాడ్జిల యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా లాడ్జిల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లాలోని లాడ్జిల యజమానులతో సమావేశమై పలు మార్గదర్శకాలను వెల్లడించారు.

లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి అతిథి నుండి ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అతిథుల పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లు, వచ్చిన మరియు వెళ్లిన సమయాలను రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.

విదేశీయులు లాడ్జిలో బస చేస్తే వారి వివరాలను 24 గంటల్లోపు Form-C ద్వారా పోలీసులకు అందించాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రిజిస్టరు వివరాలు, ఐడీ జిరాక్స్ కాపీలను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమర్పించాలని సూచించారు.

లాడ్జిలలో ఎంట్రన్స్, రిసెప్షన్, కారిడార్లు మరియు బయట రోడ్డు స్పష్టంగా కనిపించేలా CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజీని కనీసం 30 రోజుల పాటు భద్రపరచాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, తప్పుడు వివరాలు ఇచ్చేవారు లేదా మద్యం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ అత్యవసర ఎగ్జిట్, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. లాడ్జి సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల వివరాలను పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు.

ఈ నిబంధనలు పాటించని లాడ్జిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….