ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏసీబీ వలలో అటవీ శాఖ పెద్ద తలలు రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భద్రాచలం ఎఫ్‌డీఓ, డీఆర్వో

ఏసీబీ వలలో అటవీ శాఖ పెద్ద తలలు
రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భద్రాచలం ఎఫ్‌డీఓ, డీఆర్వో

ఆధాబ్ న్యూస్, భద్రాచలం, మే 7:
భద్రాచలం అటవీ శాఖలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ భద్రాచలం అటవీ శాఖ ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇన్‌చార్జ్ డీఆర్వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.

చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పొరపాటున కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డీఓ సుజాత బాధితుల వద్ద రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో అటవీ శాఖలో కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు అటవీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో చూపిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్