ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  ఖాకీకి అవినీతి మకిలి.. ఏసీబీ వలలో బోధన్ ఎస్సై

ఖాకీకి అవినీతి మకిలి.. ఏసీబీ వలలో బోధన్ ఎస్సై

ఆధాబ్ న్యూస్ బోధన్ :

నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై చిత్తన్నొజు భాస్కర చారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

ఒక క్రిమినల్ కేసులో ఫిర్యాదుదారుడి బంధువు పేరును చేర్చకుండా ఉండేందుకు మొదట రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్సై, చివరకు రూ.7 వేలకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బుధవారం పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదుదారుడి నుంచి రూ.7 వేల నగదును స్వీకరిస్తుండగా ముందస్తు సమాచారంతో వల పన్నిన ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు.

 

నిందితుడి వద్ద నుంచి రసాయన పరీక్షలో పాజిటివ్‌గా తేలిన లంచం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సైను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

 

రక్షక భటుడే భక్షకుడిగా మారి అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….