ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  ఘనంగా 141వ మేడే వేడుకలు

ఘనంగా 141వ మేడే వేడుకలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయం ముందు మండల కార్యదర్శి తోగటి కుమార్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు ఐక్యత నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని స్వీట్లు పంచుకున్నారు.

ఈ సందర్భంగా తోగటి కుమార్ మాట్లాడుతూ, కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రద్దు చేయడం కార్మికుల పట్ల తీరని ద్రోహమని విమర్శించారు. మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాటాలు కొనసాగించి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

అలాగే బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే విధంగా ఉద్యమాలు చేపట్టాలని, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం సమష్టిగా ముందుకు రావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహర్ చారి, పసుపులేటి విజయలక్ష్మి, చెన్నయ్య, సర్వేష్, పోలబోయిన సాంబయ్య, పద్మనాభ రాజు, సహాయ కార్యదర్శులు కారం రమేష్, కప్ప వెంకటేశ్వర్లు, జిల్లా టిడిపి నాయకులు ధర్మరాజు శంకర్, ఆటో యూనియన్ సభ్యులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….