భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో ఓ అటవీ శాఖ అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
గుండాల,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నడిమిగూడెం బీట్ ఆఫీసర్ మరియు సాయనపల్లి ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న బానోత్ నరేష్, వెంకటాపురం రెవెన్యూ గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుని తండ్రికి ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల పట్టా పోడు భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు రూ. 10,000 లంచం డిమాండ్ చేశాడు.
ఈ మేరకు బాధితుడు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించగా, వారు పన్నిన వలలో భాగంగా గుండాలలోని తన కార్యాలయంలో నరేష్ లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రూ. 10,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికంగా అవినీతి పై మరోసారి చర్చ మొదలైంది.








