ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  అంగన్వాడీ టీచర్లకు 49 స్మార్ట్‌ఫోన్లు పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు 49 స్మార్ట్‌ఫోన్లు పంపిణీ

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు 49 స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలల భద్రత, చైల్డ్ ప్రొటెక్షన్, మాదకద్రవ్యాల వినియోగ నివారణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, టీనేజ్ గర్భధారణలు మరియు ఎలొప్మెంట్ కేసుల నివారణపై అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ స్థాయిలో బాలల అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ల ద్వారా పిల్లల వివరాల నమోదు, పోషకాహార పర్యవేక్షణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

అదేవిధంగా, కార్యక్రమంలో 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వట్టం కాంతయ్య, ఎంపీడీవో డి.వి. కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్ఫూర్తి, ఆర్‌ఐ, జిపిఓ, జిపి సెక్రటరీ, మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాగబండి వెంకటేశ్వర్లు, ఎర్ర సురేష్, పోలేబోయిన తిరుపతయ్య, తొలెం నాగేశ్వరావు, రాందాస్ నాయక్, కృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….