ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆదివాసి విద్యార్థి ప్రతిభ – తాటి గూడెం గ్రామానికి గర్వకారణం

ఆదివాసి విద్యార్థి ప్రతిభ – తాటి గూడెం గ్రామానికి గర్వకారణం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామానికి చెందిన ఆదివాసి విద్యార్థి కొమరం నాని ప్రతిభ చాటాడు. కొమరం రాంగోపాల్–ఆదిలక్ష్మి దంపతుల కుమారుడైన నాని, కిన్నెరసాని TGTWRS గురుకుల పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో 527 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు.

వ్యవసాయ కుటుంబానికి చెందిన నాని ఈ విజయంతో తన గ్రామానికే కాకుండా ఆదివాసి సమాజానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు.

పాఠశాల అధ్యాపకులు నాని కృషిని ప్రశంసిస్తూ, చదువులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మండల ప్రజలు కూడా నాని భవిష్యత్తులో ఆదివాసి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దీవించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్