ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇద్దరు చిన్న పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య తొర్రూరు,ఆధాబ్ న్యూస్: మహబూబాబాద్ జిల్లా

ఇద్దరు చిన్న పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

తొర్రూరు,ఆధాబ్ న్యూస్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి (35) తన ఇద్దరు కుమారులు విలష్ (5), వికేష్ (3)లకు ఉరి వేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!