ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది గులాబీ జెండానే: మలకం వెంకటేశ్వర్లు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది గులాబీ జెండానే: మలకం వెంకటేశ్వర్లు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని సమాత్ మోతె గొల్లగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు గులాబీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలను దోచుకునే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలు ఆ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండాను గెలిపించి, K. Chandrashekar Rao ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ గుల్ల రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ ఇరుప కుచేలుడు, మాజీ ఉపసర్పంచ్ చేను సాంబయ్య, సీనియర్ నాయకులు సుతారి నాగేష్, వార్డు సభ్యులు ఇర్ప లక్ష్మి, ఇర్ప వంశీ, బోడ ముత్తయ్య, గోగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!