ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  26 ఏళ్ల తర్వాత స్నేహబంధం సజీవం – బాల్యమిత్రుడి కోసం 160 కి.మీ. ప్రయాణం

26 ఏళ్ల తర్వాత స్నేహబంధం సజీవం – బాల్యమిత్రుడి కోసం 160 కి.మీ. ప్రయాణం

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ : స్వార్థం లేని స్నేహం ఎంత గొప్పదో మరోసారి నిరూపించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. 26 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు కోసం సుదూర ప్రయాణం చేసి సహాయం చేసిన సంఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

1995 నుండి 2000 సంవత్సరాల మధ్య కాలంలో పాల్వంచ గురుకుల పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో నివసిస్తున్నారు. ఈ మిత్రుల్లో జిమ్మిడి శ్రీను అనారోగ్య కారణాల వల్ల వికలాంగుడిగా మారాడు. ఇటీవల ప్రభుత్వం అతనికి ట్రైసైకిల్ అందజేసింది.

శ్రీను స్వస్థలం కరకగూడెం మండలం తాటిగూడెం గాంధీనగర్ గుంపు. గత నెలలో కొత్తగూడెంలో ట్రైసైకిల్ పొందిన అనంతరం ఇంటికి బయలుదేరిన సమయంలో పాల్వంచ వద్ద ట్రైసైకిల్ పంచర్ అయింది. అక్కడ పరిచయస్తుల ఇంటి వద్ద వాహనాన్ని ఉంచి, బస్సులో ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ పరిస్థితిలో తన బాల్యమిత్రులకు సమాచారం అందించగా, వారి సహకారంతో సత్తుపల్లి నివాసి గొల్లమందల కృష్ణ ముందుకు వచ్చాడు. సత్తుపల్లి నుంచి 76 కిలోమీటర్లు ప్రయాణించి పాల్వంచకు చేరుకున్న కృష్ణ, ట్రైసైకిల్‌ను తీసుకుని పంచర్ వేయించి, లైట్లు అమర్చి, ఎండలో ట్రాలీ ఆటో ద్వారా రాత్రి 9 గంటల వరకు కరకగూడెం మండలం తాటిగూడెం చేరుకున్నాడు.

26 సంవత్సరాల తర్వాత తన మిత్రుడిని కలుసుకున్న కృష్ణ భావోద్వేగానికి లోనై, ట్రైసైకిల్‌ను శ్రీనుకు అందజేసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అనంతరం తిరుగు ప్రయాణంగా సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించి మణుగూరు మీదుగా సత్తుపల్లి చేరుకున్నాడు.

ఈ సంఘటన స్నేహబంధం ఎంత గొప్పదో, మానవత్వం ఎలా పరిమళించాలో చూపించింది. జిమ్మిడి శ్రీను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృష్ణతో పాటు సహకరించిన బాల్యమిత్రులను అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….