ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ,కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కలవలనాగారం గ్రామానికి చెందిన భూక్య దశిలమ్మ, భూక్య సక్రమ్మతో పాటు బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తోలెం శిరీష తమ కొత్త ఇళ్లలో గృహప్రవేశం నిర్వహించగా, ఎమ్మెల్యే పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలకు గృహ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దినేష్ కుమార్, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, ఏపీఎం, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, రాందాస్ నాయక్, జలగం క్రిష్ణ, పోలేబోయిన తిరుపతయ్య, నాగబండి వెంకటేశ్వర్లు, తొలెం నాగేశ్వరరావు, పడిగ సమ్మయ్య, నేతాజీ, సాగర్ తదితరులు, సర్పంచ్లు, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ ప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
విద్యుత్, అటవీ మరియు పోలీస్ శాఖల అధికారులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









