ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు – సంబరాలు చేసిన ప్రజలు

నాగర్ కర్నూల్  మార్చి 30 (ఆధాబ్ న్యూస్):

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీ వదిలివ్వడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ వేసి అతడిని పట్టుకున్నారు.

ఈ ఘటనతో అంబేద్కర్ చౌరస్తాలో బాధితులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుతూ “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.

అతను పలువురిని డబ్బులకు వేధించాడని, సీసీ కెమెరాల పేరుతో గ్రామాల్లో వసూళ్లు చేశాడని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని డబ్బులు దండుకున్నాడని బాధితులు ఆరోపించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్