గంజాయి కేసుల్లో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన షేక్ మున్వర్ గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పలుమార్లు పట్టుబడడంతో అతనిపై PIT NDPS (పీడీయాక్ట్) నమోదు చేశారు. మొత్తం ఐదు కేసుల్లో సుమారు 287 కిలోల గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
డిటెన్షన్ ఆర్డర్ మేరకు మున్వర్‌ను చర్లపల్లి జైలుకు తరలించగా, అడ్వైజరీ బోర్డు కూడా ఒక సంవత్సరం నిర్భంధాన్ని సమర్థించింది. గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
Post Views: 15









