దొంగిలించబడిన మొబైల్‌ను రికవరీ చేసిన పోలీసులు – అభినందనలు వెల్లువ
పినపాక, మార్చి 20 ఆధాబ్ న్యూస్: పినపాక నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కోర్స ఆనంద్‌కు చెందిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసి అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే… కోర్స ఆనంద్ మేడారం జాతరకు వెళ్లిన సందర్భంగా ఆయనకు చెందిన సుమారు రూ.53 వేల విలువైన Oppo Reno 8 Pro మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైంది. వెంటనే ఆయన CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఏడుళ్ల బయ్యారం పోలీసులు ప్రత్యేక చొరవతో దర్యాప్తు చేపట్టి, ఆ మొబైల్ ఫోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం CI వెంకటేశ్వర్లు, SI సురేష్ ఆధ్వర్యంలో మొబైల్‌ను సురక్షితంగా రికవరీ చేసి, నేడు బాధితుడు కోర్స ఆనంద్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా కోర్స ఆనంద్ మాట్లాడుతూ, తన మొబైల్‌ను తిరిగి అందించిన పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తి రక్షణలో పోలీసులు చూపిన కర్తవ్యనిష్ఠను అభినందించారు.
స్థానికంగా కూడా పోలీసుల పనితీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.









