నవోదయ ఎంట్రన్స్‌లో సత్తా చాటిన ఎక్స్‌లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని
పినపాక, మార్చి 18: ఆధాబ్ న్యూస్:
నవోదయ ప్రవేశ పరీక్షలో బయ్యారం ప్రాంతానికి చెందిన ఎక్స్‌లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక ప్రతిభ కనబరిచి 17వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమె ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందిస్తూ సత్కరించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని సాధారణ విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన విద్య అందిస్తున్నామని యూసఫ్ షరీఫ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఖాదర్ షరీఫ్, యాకూబ్ షరీఫ్, ముక్కు నరసారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 87









