కోకాపేట్‌లో ‘అల్లు సినిమా’ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి,
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నగరంలోని కోకాపేట్‌లో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ‘అల్లు సినిమా’ థియేటర్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పాల్గొన్నారు. అల్లు కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, ప్రముఖ నటుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో నిర్మించిన ఈ థియేటర్ కాంప్లెక్స్ హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్ సినిమా రంగానికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘Telangana Rising 2047’ విజన్‌లో భాగంగా వినోద రంగాన్ని బలమైన పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ అల్లు కుటుంబం నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లకు మంత్రులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.









