10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
కరకగూడెం,మార్చి 13: ఆధాబ్ న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలిపారు.
పరీక్షలను భయంగా లేదా ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం మరియు ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథంతో పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు కోరారు.
అలాగే తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రతి విద్యార్థి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అందుకోవాలని ఆకాంక్షించారు.
మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.









