పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సుల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు మండల ప్రత్యేక అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఉపయోగపడే విధంగా రైటింగ్ ప్యాడ్లు మరియు జ్యామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సహాయం వల్ల విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.









