ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం – 130 మందికి పరీక్షలు

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం – 130 మందికి పరీక్షలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిర్రమల్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం వంద రోజుల మిషన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

శిబిరంలో భాగంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రాణాలను కాపాడే సీపీఆర్ (CPR) విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ఎండాకాలం నేపథ్యంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా వివరించారు.

మణుగూరు ఏరియా ఆసుపత్రి ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి. సంజీవరావు విద్యార్థులకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, సైట్ సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పోషకాహారం, కంటి వ్యాయామాల గురించి వివరించారు. ఆర్‌బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ సీపీఆర్ విధానం, వడదెబ్బ లక్షణాలు మరియు జాగ్రత్తలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.

ఈ వైద్య శిబిరాన్ని ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ ఈ. బాలరాజు సమన్వయం చేశారు. కార్యక్రమాన్ని కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు సందర్శించి వైద్య సిబ్బందిని అభినందించారు.

శిబిరంలో ఆర్‌బిఎస్కే ఫార్మసిస్ట్ సరస్వతి, ఏఎన్ఎంలు పుష్ప, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం నిర్వహించిన ఈ వైద్య శిబిరం వారికి ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….