వైన్ షాపుల సమయపాలన ఉల్లంఘనపై ఫిర్యాదు
మణుగూరు, ఆధాబ్ న్యూస్ : ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా వైన్ షాపులు సమయపాలన పాటించడం లేదని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
వైన్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని, బెల్ట్ షాపులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం ఫోన్‌పే, గూగుల్‌పే వంటి ఆన్లైన్ చెల్లింపు సేవలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కోరారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Post Views: 70









