విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం
కరకగూడెం ఆధాబ్ న్యూస్: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సర్పంచ్ పోలేబోయిన సుజాత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ ఎన్.వి. వేణుగోపాల్ చారిని శాలువాతో సత్కరించారు. మండలంలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 51









