తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు కావడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ–ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 130 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 70కిపైగా తుపాకులు, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఈ లొంగుబాటు కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు అధికారులకు లొంగిపోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం మరియు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి రావడానికి ముందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. లొంగుబాటు చేసిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస సదుపాయాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటన తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా భావిస్తున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి.









