ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  అశ్వాపురంపాడులో హత్య కేసు ఛేదన… ఐదుగురు నిందితులు అరెస్ట్

అశ్వాపురంపాడులో హత్య కేసు ఛేదన… ఐదుగురు నిందితులు అరెస్ట్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28 అర్ధరాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, వారిని రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం… అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కొవ్వాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పథకం ప్రకారం గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. గ్రామంలో కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు మరియు విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు:

1. వజ్జ భీమరాజు (38), అశ్వాపురంపాడు – వ్యవసాయం

2. మడివి మంగయ్య (39), అశ్వాపురంపాడు – వ్యవసాయం

3. మడివి నందయ్య (37), అశ్వాపురంపాడు – వ్యవసాయం

4. వంకా బాలాజీ (36), ట్రాక్టర్ డ్రైవర్ – సారపాక (బూర్గంపాడు మండలం)

5. మడకం లక్ష్మయ్య (40), సుతారి మేస్త్రీ – తాళ్లగొమ్మూరు (బూర్గంపహాడ్ మండలం)

 

పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, మొదటి ముగ్గురు నిందితులకు మృతుడితో గత కొంతకాలంగా గ్రామంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని భావించి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో జైలులో పరిచయమైన బాలాజీ సహాయంతో రూ.50 వేల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుని, బాలాజీ తన స్నేహితుడు లక్ష్మయ్యతో కలిసి ఫిబ్రవరి 27న అశ్వాపురంపాడు గ్రామానికి వచ్చారు. అనంతరం పథకం ప్రకారం ఫిబ్రవరి 28 అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, ఏడూళ్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలతో ఉన్న బట్టలు మరియు ఘటనకు ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరచగా, కోర్టు వారిని రిమాండ్‌కు పంపింది.

ఈ ఆపరేషన్‌లో స్థానిక ఎస్ఐ పి.వి.ఎన్. రావు, ఎస్ఐ పి. సురేష్ (ఏడూళ్ల బయ్యారం) మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….