ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణలో వాహనాల ధరలు పెరుగనున్నాయి – మార్చి

తెలంగాణలో వాహనాల ధరలు పెరుగనున్నాయి – మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలు

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుండి కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై “రోడ్ సేఫ్టీ సెస్” (భద్రత పన్ను) విధించేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధన ప్రకారం కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు మరియు ఇతర నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుండి రూ.10,000 వరకు పన్ను వసూలు చేయనున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ భద్రత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో రహదారి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ పన్ను ద్వారా సంవత్సరానికి సుమారు రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

మార్చి 1 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త పన్ను వల్ల వాహనాల ధరలు కొంతమేర పెరగనున్నాయి. దీంతో వాహన కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్