ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మేడారం వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

మేడారం వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా
ఐదుగురికి తీవ్ర గాయాలు

ములుగు,ఆధాబ్ న్యూస్: మేడారంకు భక్తులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి వెళ్తున్న వాహనం, తాడ్వాయి దాటిన సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్