ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దొరికిన సొమ్మును బాధితుడికి తిరిగి అందజేసి ఓ కానిస్టేబుల్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.

దొరికిన సొమ్మును బాధితుడికి తిరిగి అందజేసి ఓ కానిస్టేబుల్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్, ఆదివారం పినపాక మండలం జానంపేటలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన రహదారిపై ₹5,600 నగదు దొరికింది.

తక్షణమే ఆ మొత్తంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన లక్ష్మణ్, ఆ డబ్బు ఓ లారీ డ్రైవర్‌ది అని గుర్తించారు. అనంతరం ఆయన్నే కనుగొని మొత్తాన్ని సురక్షితంగా అందజేశారు.

కానిస్టేబుల్ లక్ష్మణ్ నిజాయితీని స్థానికులు అభినందించగా, పలువురు ఆయన పనితీరును ప్రశంసిస్తూ మంచి పోలీస్‌కు ఇది నిజమైన ఉదాహరణ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్