ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారంలో వనమాల సుదర్శన్‌కు బీఆర్ఎస్ నాయకుల నివాళి.

అనంతారంలో వనమాల సుదర్శన్‌కు బీఆర్ఎస్ నాయకుల నివాళి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన వనమాల శ్రీను (ఫెర్టిలైజర్) తండ్రి వనమాల సుదర్శన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఇతర స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారి నివాసానికి చేరుకొని సుదర్శన్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయకులు, వారి దుఖ్ఖంలో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మ సత్యనారాయణ, అత్తె నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ అత్తె సత్యనారాయణ, మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, పసునూరి అంజయ్య, కొమ్మ ప్రసాద్, బత్తని సీతయ్య, అత్తె ముకుందా, షేక్ అబ్దుల్లా, వనమాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్