ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వారావుపాడు గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

అశ్వారావుపాడు గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
కరకగూడెం ,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని అశ్వారావుపాడు గోత్తికోయ గ్రామంలో ఉన్న సరస్వతి విద్య పీఠం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మ సంస్థ ఫౌండర్‌ అయిన కరకగూడెం గ్రామానికి చెందిన అండెం యాకన్న సహకారంతో విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు తదితర విద్యా సామగ్రిని ఉపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా అండెం యాకన్న మాట్లాడుతూ —
విద్యాభివృద్ధి కోసం తన వంతు సహాయం అందిస్తున్నానని, విద్య అనేది ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు బలమైన పునాది అవుతుందని తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలు సంపాదించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రోజారాణి, నాగమణి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్