ప్రతి క్షణం
ప్రజల పక్షం

  స్వప్న పార్థివ దేహానికి రేగా కాంతారావు నివాళులు

స్వప్న పార్థివ దేహానికి రేగా కాంతారావు నివాళులు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన జయబాబు సతీమణి స్వప్న (FBO) అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం రేగా కాంతారావు జయబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వప్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, కొమరం రాంబాబు, పోగు వెంకటేశ్వర్లు, గుడ్ల రంజిత్ కుమార్, పాయం నరసింహారావు, సుతారి నాగేష్, ప్రభాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్