ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రవాణా శాఖ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు – ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సంచలనం

రవాణా శాఖ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు – ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రవాణా శాఖ చెక్‌పోస్టులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ దాడులు ఉదయం వరకు కొనసాగాయి.

అధికారులు అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్‌పోస్టులు సహా పలు ప్రదేశాల్లో అక్రమ వసూళ్లపై సోదాలు జరిపారు. చెక్‌పోస్టులలో లెక్కలకు సరిపోని అనధికార నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఇప్పటికే చెక్‌పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అవి తాత్కాలికంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆచూకీ సేకరించి దాడులు చేసినట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్