ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పోషణ వాటిక కార్యక్రమంలో భాగంగా కూరగాయల తోట ఏర్పాట్లు

పోషణ వాటిక కార్యక్రమంలో భాగంగా కూరగాయల తోట ఏర్పాట్లు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం
మండల పరిధిలోని తాటిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో “పోషణ వాటిక” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మణుగూరు ఐసిడీఎస్ సీడీపీఓ పొలెబోయిన జయలక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీఓ దేవా వరకుమార్‌తో కలిసి మోడల్ న్యూట్రిన్ గార్డెన్‌లో కూరగాయలు, ఆకుకూరలు నాటడం ద్వారా పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీఓ మారుతీ, అనంతారం సెక్టర్ సూపర్‌వైజర్ రాజమణి, కరకగూడెం సెక్టర్ సూపర్‌వైజర్ భద్రమ్మ, సూపర్‌వైజర్ పద్మ, అంగన్‌వాడీ టీచర్ పి. చంద్రకళ పాల్గొన్నారు.

అధికారులు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యాభివృద్ధి కోసం ఇలాంటి పోషకాహార తోటలు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో నెలకొల్పాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్