ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు”

కరకగూడెం, అక్టోబర్ 2 (ఆధాబ్ న్యూస్):
మహాత్మా గాంధీ జయంతిని కరకగూడెం మండలం సీతరాంపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్, తెలంగాణ గాంధీ స్మారక నిధి రాష్ట్ర బోర్డ్ సభ్యుడు చందా లింగయ్య దొర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కూడా పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు.

కార్యక్రమాన్ని గాంధీ స్మారక నిధి కరకగూడెం మేనేజర్ & మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ వేడుకలో గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం, బైరిశెట్టి చిరంజీవి, చిట్టి ప్రసాద్, గొగ్గల రవి, చందా రత్నమ్మ, చందా నాగేశ్వరరావు, గొగ్గలి కృష్ణ, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్