ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం ఆదివాసీ జేఏసీ నాయకుడు రాష్ట్రస్థాయి గుర్తింపు

కరకగూడెం ఆదివాసీ జేఏసీ నాయకుడు రాష్ట్రస్థాయి గుర్తింపు

కరకగూడెం, సెప్టెంబర్ 18: ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకటనారాయణ తెలంగాణ రాష్ట్ర 9 తెగల ఆదివాసీ జేఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఆదివాసీ సంఘాల ఐక్యవేదికగా ఏర్పడిన జేఏసీ తక్కువ సమయంలో విజయవంతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని నాయకులు అభినందించారు.

లంబాడిలను చట్టబద్ధత లేకుండా తొలగించాలనే ఉద్యమంలో ఆదివాసీ 9 తెగల ధర్మయుద్ధంలో భాగంగా వెంకటనారాయణ ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్