ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జర్నలిస్టులకు శుభవార్త: హెల్త్ స్కీమ్ పథకం ఏడాది పొడిగింపు

హైదరాబాద్ ఆధాబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం  వర్కింగ్ జర్నలిస్టులకు కల్పిస్తున్న ఉచిత హెల్త్ స్కీమ్ పథకాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం వర్తించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. పత్రికా రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ స్కీం ద్వారా జర్నలిస్టులు నిర్దిష్ట ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. పాత గడువు జూన్ 30తో ముగియగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….